Tuesday, January 21, 2025
Homeసినిమాకింగ్ నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు `ఘోస్ట్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

కింగ్ నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు `ఘోస్ట్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

కింగ్ అక్కినేని నాగార్జునకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి `ది ఘోస్ట్` అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ఘోస్ట్ అనేది ఈ సినిమాకి తగిన టైటిల్ అని చిత్రబృందం తెలిపింది. లండన్‌లో అద్భుతమైన బిగ్ బెన్ కూడా రాత్రిపూట పోస్టర్ లో భయపెట్టేంత భీకరంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంది అనే విష‌యాన్ని మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా చూపించారు మేక‌ర్స్‌.

మీరు అతన్ని చంపలేరు… మీరు అతని నుండి పారిపోలేరు … మీరు అతనితో చర్చలు జరపలేరు… కేవ‌లం మీరు దయ కోసం మాత్రమే వేడుకోవచ్చు …” అయినప్పటికీ నో మెర్సీ, క్యాప్షన్ ని జోడించారు. మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లైవ్లీగా ఉంది. ఈ సినిమాలో నాగ్ స‌ర‌స‌న కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP -నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప‌తాకాల‌పై నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు .. శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ స‌హా ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ముఖేష్ జి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా..బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. రాబిన్ సుబ్బు నభా మాస్టర్ స్టంట్స్ అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్