Saturday, January 18, 2025
Homeసినిమానాగ్ 100వ చిత్రం గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

నాగ్ 100వ చిత్రం గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

Century mark: టాలీవుడ్ కింగ్ నాగార్జున సెంచరీకి చేరువ‌య్యారు. అభిమానుల లెక్క‌ల ప్ర‌కారం.. ఆయ‌న న‌టించిన గెస్ట్ రోల్స్ కూడా క‌లిపితే ఎప్పుడో వంద పూర్త‌య్యింది. అయితే.. నాగార్జున లెక్క ప్ర‌కారం ఇంకా వంద పూర్తి కాలేదు. బంగార్రాజు సినిమా టైమ్ లో త‌న లెక్క‌ల్లో నూరో సినిమాకు టైమ్ ఉంది, సరైన స‌మ‌యంలో 100వ సినిమాని అనౌన్స్ చేస్తాన‌ని చెప్పారు. ఇప్పుడు మ‌ళ్లీ ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది.

ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు.  ఆ తర్వాత నటించబోతున్న సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో నాగార్జున వందవ సినిమాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ మీడియా వర్గాల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  నాగార్జున, రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో ఇప్ప‌టివ‌ర‌కు 9 సినిమాలు వ‌చ్చాయి.

అందులో అన్నమయ్య, శ్రీరామదాసు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నాగార్జున సినీ కెరీర్ లో నిలిచిపోయే సినిమాలుగా పేరు దక్కించుకున్నాయి. అలాంటి మరో భ‌క్తిర‌స చిత్రాన్ని నాగార్జున వందవ సినిమాగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిజ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్