Sunday, January 19, 2025
HomeTrending News32 ఏళ్ళ తర్వాత నళినికి విముక్తి

32 ఏళ్ళ తర్వాత నళినికి విముక్తి

దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ఆరుగురు వ్యక్తులకు శనివారం స్కేచ్ఛ లభించింది. ఈ కేసులో 32 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి ఈ రోజు (శనివారం) సాయంత్రం విడుదలయ్యారు. త్వరలోనే మిగతా నిందితులు జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్ర రాజా, శ్రీహరన్ కూడా విడుదల కానున్నారు. నిందితులు జైలులో మంచి నడవడికతో ఉన్నారని, జైలులో ఉన్న సమయంలో వివిధ డిగ్రీలు పూర్తి చేశారని కోర్టు తెలిపింది.

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఎల్టీటీఈకి చెందిన ఓ మహిళా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడం ద్వారా రాజీవ్ ను హత్య చేశారు. ఈ కేసులో అరెస్టయిన నళిని, శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, పెరారివాలన్ లు దోషులుగా తేలడంతో వారికి కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో వీరిని తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. 32 ఏళ్లుగా వీరు అదే జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. వీరిలో పెరారివాలన్ కు గత మే నెలలో సుప్రీంకోర్టు స్వేచ్ఛను ప్రసాదించింది. తాజాగా సుప్రీంకోర్టు మిగిలిన దోషులకు కూడా స్వేచ్ఛను ప్రసాదించింది.

అయితే రాజీవ్ గాంధి హత్య కేసులో నిందితుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం దేశ స్పూర్తికి అనుగుణంగా వ్యవహరించలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్