Sunday, January 19, 2025
HomeTrending NewsNallari: కర్నాటక ఎన్నికల్లో కిరణ్ సేవలు?

Nallari: కర్నాటక ఎన్నికల్లో కిరణ్ సేవలు?

నిన్న భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీలో పలువురు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను నల్లారి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కర్నాటక ఎన్నికలపై బిజెపి అగ్రనేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశంలో  జరిగిన కీలక భేటీలో అమిత్ షా, బిఎల్ సంతోష్, బిఎస్ యడ్యూరప్ప, కర్నాటక సిఎం బసవరాజ్ బొమ్మైలు పాల్గొన్న సమావేశంలో కూడా కిరణ్ పాల్గొన్నారు.

కర్నాటక ఎన్నికలకు కిరణ్ కుమార్ రెడ్డి సేవలను వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని బిజెపి వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఢిల్లీ చేరుకున్నారు.  ఈ సాయంత్రం కిరణ్, సోము కలిసి బిజెపి అగ్రనేతలను మరోసారి కలుస్తారని తెలిసింది. సోము వీర్రాజు మూడు రోజులపాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్