Saturday, January 18, 2025
HomeTrending Newsసిఎంకు నందమూరి అభిమానుల కృతజ్ఞతలు

సిఎంకు నందమూరి అభిమానుల కృతజ్ఞతలు

Thanks to CM: నందమూరి కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సన్నిహితులు, నిమ్మకూరు గ్రామస్తులు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతామంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్,  నందమూరి పెద వెంకటేశ్వరరావు,  నందమూరి జయసూర్య,  చిగురుపాటి మురళీ, పలువురు నిమ్మకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.

Also Read : కొత్త జిల్లాల ఏర్పాటులో అయోమయం వద్దు: సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్