ఒకప్పుడు సినిమాలు వంద రోజులు, సిల్వర్ జూబ్లీ ఆడేవి కానీ.. ఇప్పుడు అలా లేదు. ఏ సినిమా అయినా మూడు లేదా నాలుగు వారాలు ఆడితే గొప్ప అనేట్టు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య ఆతర్వాత వీరసింహారెడ్డి సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం 175 రోజులు పూర్తి చేసుకుంది. కర్నూలు జిల్లా ఆలూరులోని శ్రీలక్ష్మీ నరసింహా థియేటర్లో రోజుకు 4 ఆటలతో జులై 5కు 175 రోజులు పూర్తి చేసుకుంది.
అయితే అసలు విశేషం ఇది కాదు. వరుసగా డబుల్ రోల్ చేసిన ఒకే హీరో రెండు సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ల చిత్రాలు 175 రోజులు చాలానే ఆడాయి కానీ బ్యాక్ టు బ్యాక్ డబుల్ రోల్ చేయడం.. ఆ రెండు చిత్రాలు ఆడటం మాత్రం ఇండియాలోనే ఇది మొదటిసారని నందమూరి అభిమానులు అంటున్నారు. వెనక్కు వెళ్లి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. వీరసింహారెడ్డి చిత్రం ఓటిటిలో వచ్చి నెలలు దాటేసింది. అయినప్పటికీ కొత్త సినిమాల తాకిడిలో కూడా వీరసింహారెడ్డి చిత్రానికి ఇంత లాంగ్ రన్ రావడం విశేషం.
అభిమానుల సపోర్ట్ వలన ఇది సాధ్యమయ్యిందేమో అనుకున్నా సినిమా ఆడుతున్నన్ని రోజులు జనాలు బాగానే వచ్చారట. మొత్తానికి బాలయ్య ఖాతాలో సమీప భవిష్యత్ లో ఇంకెవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డు దక్కింది. అఖండ, వీరసింహారెడ్డిల తర్వాత ఇప్పుడు మరింత జోష్ తో భగవంత్ కేసరిగా అక్టోబర్ లో రాబోతున్నారు. ఇప్పుడు బాలయ్య హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. భగవంత్ కేసరి ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో..?.