Saturday, January 18, 2025
HomeTrending Newsతెలుగు జాతి చైతన్యం ఎన్టీఆర్: బాలయ్య

తెలుగు జాతి చైతన్యం ఎన్టీఆర్: బాలయ్య

Floral Tributes: యువకులు రాజకీయాల్లోకి వచ్చి ఉత్సాహంతో పనిచేయాలని సినీ నటులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపు ఇచ్చారు. తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా స్వగ్రామం నిమ్మకూరులో ఆయన విగ్రహానికి పుష్పంజలి ఘటించి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చి రాజకీయాల్లో ప్రవేశించి  ఒక పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారం చేపట్టారని గుర్తు చేశారు.  తెలుగువారి ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం…. తెలుగు జాతి చైతన్యానికి విశ్వరూపం ఎన్టీఆర్ అని, ఆయన శక పురుషుడని బాలయ్య అభివర్ణించారు.

రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు, జనతా వస్త్రాలు లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలకు అయన శ్రీకారం చుట్టారని వివరించారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని,  నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్ 35 అడుగుల విగ్రహం ఏర్పాటు ఏర్పాటు చేయాలని అంతా తీర్మానించామన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదని, కానే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నామని వ్యాఖ్యానించారు.  రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లడతానని బాలయ్య చెప్పారు. అంతకుముందు నిమ్మకూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.

Also Read : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. తెలుగు జాతికి బాలకృష్ణ లేఖ. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్