Sunday, January 19, 2025
Homeసినిమారానాతో కలిసి యాక్ట్ చేయాలనే ఉంది: హీరో నాని 

రానాతో కలిసి యాక్ట్ చేయాలనే ఉంది: హీరో నాని 

రానా ఒక బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు. కానీ నాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చాడు. అయితే ఈ ఇద్దరి మధ్య చాలా కాలం నుంచి మంచి స్నేహం ఉంది. అలాంటి రానా .. నాని ఇద్దరూ కలిసే సోనీలివ్ నిర్వహిస్తున్న ‘నిజం’ టాక్ షోకి వచ్చారు. నిన్నటి నుంచే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో రానా గురించి నానీ .. ఆయన గురించి రానా .. ఇద్దరూ కలిసి తమ కెరియర్ ను గురించి .. వారసత్వాన్ని గురించి మాట్లాడారు.

నాని మాట్లాడుతూ .. తన కెరియర్ ఆరంభంలో ఇండస్ట్రీకి సంబంధించినవారు ఎవరూ కూడా తన గురించి పెద్దగా మాట్లాడుకోలేదనీ, తన సినిమాలను వారు పట్టించుకోవడం లేదని తాను అనుకునేవాడినని అన్నాడు. తన సినిమాలు ఎవరైనా చూస్తారా అనే అనుమానం కూడా ఆ సమయంలో తనకి కలిగిందనీ, అదృష్టం కొద్దీ ప్రేక్షకులు తనని అంగీకరిస్తూ రావడం .. తనపై తనకి నమ్మకం కలిగేలా చేయడం జరిగిందని చెప్పాడు.

అలాంటి పరిస్థితుల్లో ఒక ఇంటర్వ్యూలో తన గురించి రానా చాలా గొప్పగా మాట్లాడనీ, తనపై ఆయనకి గల నమ్మకాన్ని చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీ తనని గమనిస్తూనే ఉందనే విషయం అర్థమైందనీ, రానాతో పరిచయం ఏర్పడటం .. అది స్నేహంగా మారటం జరిగిందని అన్నాడు. ఇద్దరం కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన తమకి చాలా సార్లు వచ్చిందనీ, అయితే అందుకు తగిన సమయం రావలసి ఉందని చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్