Saturday, January 18, 2025
Homeసినిమాక్లైమాక్స్ కి చేరుకున్న నాని మూవీ!

క్లైమాక్స్ కి చేరుకున్న నాని మూవీ!

నాని నుంచి క్రితం ఏడాది ‘దసరా’ .. ‘హాయ్ నాన్న’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలలో ‘దసరా’ బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే సందడి చేసింది. నాని – కీర్తి సురేశ్ కలిసి మరో హిట్ కొట్టారు. ఆ తరువాత నాని నుంచి ‘హాయ్ నాన్న’ వచ్చింది. ఈ సినిమా ఆరంభంలో కాస్త డీలాపడినట్టుగా అనిపించినా, ఆ తరువాత వసూళ్ల పరంగా పుంజుకుంది. అలాగని నాని స్థాయి హిట్ సినిమాల జాబితాలో దేనిని వేయడానికి కొంచెం ఆలోచన చేయవలసిందే.

ఇక ఈ ఏడాది నాని నుంచి ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. ఆయన తాజా చిత్రంగా రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ షూటింగు దశలో ఉంది. డీవీవీ దానయ్య – కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. తనకి కామెడీ పై మంచి పట్టుందనే విషయాన్ని ఇంతకుముందే నిరూపించుకున్నాడు. టైటిల్ తోనే అందరి దృష్టిని తన ప్రాజెక్టు వైపు తిప్పుకున్న నాని, ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందని భావిస్తున్నాడు.

ఈ సినిమాలో నాని సరసన నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. గతంలో నాని – ప్రియాంక ‘నానీస్ గ్యాంగ్ లీడర్’లో కలిసి నటించారనే విషయం తెలిసిందే. ఇక ‘సరిపోదా శనివారం’ క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్ – అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 17వ తేదీ వరకూ ఇక్కడ షూటింగు జరుగుతుందని అంటున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 29వ తేదీన విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్