Sunday, November 24, 2024
HomeTrending Newsమోడీ ఫొటో పెట్రోల్ బంకుల్లో పెట్టాలి - ఎమ్మెల్సీ కవిత

మోడీ ఫొటో పెట్రోల్ బంకుల్లో పెట్టాలి – ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రానికి నిర్మలాసీతారామన్ వచ్చి ఫొటోల పంచాయితీ పెట్టారని.. గతంలో రేషన్ షాపుల్లో ప్రధానమంత్రుల ఫొటోలు ఉన్నాయా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మోడీ ఫొటో పెట్టాల్సింది రేషన్ షాపుల్లో కాదని..పెట్రోల్ బంకుల్లో అని ఎద్దేవా చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు కేంద్రమే కారణమని ఆరోపించారు. నిజామాబాద్ లో నిర్వహించిన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ పెద్దకొడుకులా మారి ఆసరాగా నిలుస్తున్నారని ఆమె చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 50వేలకు పైగా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు.

అర్హులందరికీ పెన్షన్ లు వస్తాయని.. ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదని కవిత అన్నారు. పేదల బాధలు అర్థం చేసుకుని సీఎం కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారని.. ఈ కార్యక్రమం ఇంట్లో ఇద్దరికీ ఇచ్చేస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కానీ మోడీ మాత్రం ఉచితాలు వద్దంటూ.. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఆపేసే కుట్రకు తెరదీస్తున్నారని విమర్శించారు. పేదలకు పంచాల్సిన 10లక్షల కోట్లను తన కార్పోరేట్ ఫ్రెండ్స్ కు పంచిన ఘనత మోడీకే దక్కతుందని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్