Sunday, January 19, 2025
Homeసినిమా10 నుంచి స్ట్రీమింగ్ కానున్న 'నాతి చరామి'

10 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘నాతి చరామి’

Naathi  Charaami: వై2కె సమస్య కారణంగా హైద‌రాబాద్‌లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘నాతిచరామి’.  నాగు గవర దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఎంట‌ర్‌ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు. ఇంతకు ముందు విడుదల చేసిన చిత్ర ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రికార్డ్ స్థాయిలో  అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, యమ్.ఎక్స్, ప్లేయర్ వంటి  20 ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో ఈనెల 10 న స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ మీద ఎవరు కన్నేసినా వాడు రాక్షసుడే.. కాలం ఏదైనా కథ ఇదే.. సీతాదేవి, ద్రౌపది, దుర్గాదేవిల కథలు చదివాను. వీరంతా కూడా సమాజంలో చాలా ఫైట్ చేసి బిగ్ ఛాలెంజ్ ను ఎదుర్కొన్నారు. నేను చెన్నైలో ఉండగా దర్శకుడు నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పడం జరిగింది.ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నా జీవితానికి గగ్గరగా ఉన్న కథ “నాతి చరామి”. 2007 లోనే పెళ్లి చేసుకొని అబ్రాడ్ కు వెళ్ళాలి అనుకున్నాను. కానీ సినిమానే నా జీవితం అయిపోయింది.

చాలా మంది మద్య తరగతి నుండి వచ్చిన అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. అవి అందరికీ నెరవేరవు. అయితే వారంతా  వారి బలమేంటి, బలహీనతలేంటి తెలుసుకొని ఎంతో మనో ధైర్యంతో ముందుకెళ్లాలి. అప్పుడే సక్సెస్ సాధిస్తారు. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. భార్యభర్తల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాలో చాలా బావుంటాయి.ఇలాంటి మంచి కథకు నన్ను సెలెక్ట్ చేసుకొన్న దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ “ప్రపంచంలో ఉన్న స్త్రీ మూర్తులందరికీ శిరస్సు వచ్చి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి… ముగ్గురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ‘నాతిచరామి’. బలమైన సన్నివేశాలు, అర్థవంతమైన సంభాషణలు, అద్భుతమైన అభినయంతో సినిమా ఉంటుంది. 1999, 2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, రూపొందించిన చిత్రమిది. ఇక్కడ జరిగిన క్రైమ్ కంటే దీని చుట్టూ జరిగిన డ్రామా నచ్చింది. ఈ కథకు సరైన యాక్టర్ ఉంటే ఈ కథను పవర్ ఫుల్ గా చెప్పచ్చు. అనిపించి శ్రీలత క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని ఈ కథకు పూనమ్ కౌర్ అయితే బాగుంటుందని తనకి ఈ కథ చెప్పడం జరిగింది.  మార్చి 10 న ఓటిటి లో విడుదల అవుతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్