కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు (గురువారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు సోనియాకు సమన్లు జారీ చేశారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు సోనియా ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అంతకుముందు ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ ఎంపీలతో సోనియా గాంధి భేటీ కానున్నారు.
Also Read : మూడు రోజుల్లో దాదాపు 30 గంటల విచారణ