Sunday, January 19, 2025
Homeసినిమాజాతి రత్నం - కొత్త చిత్రం

జాతి రత్నం – కొత్త చిత్రం

ఇటీవలి కాలంలో పలు భారీ ప్రాజెక్టులతో పాటు చిన్న హీరోలతో కూడా చిత్రాలు నిర్మిస్తూ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ సంస్థ ఇప్పుడు కొత్త బ్యానర్ తో  కలసి మరో వినోద భరిత చిత్రాని అందించటానికి సిద్ధమవుతోంది. ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి సితార ఎంటర్ టైన్మెంట్స్ తమ 15 వ సినిమాగా కొత్త ప్రాజెక్టులు ప్రకటించింది. తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న (1931,సెప్టెంబర్ 15)  రోజునే ఈ సరికొత్త ప్రాజెక్టు ప్రకటించడం విశేషం

జాతి రత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి కథానాయకుడుగా సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’   సంయుక్తంగా నిర్మించనున్న సినిమాను ఈరోజు ఉదయం 9.36 నిమిషాలకు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము’ అంటూ ప్రకటించారు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, విశేషాలను త్వరలో వెల్లడిస్తామని ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్