4.6 C
New York
Tuesday, December 5, 2023

Buy now

Homeసినిమాఅభిమానులకు నవీన్ నైతిక స్థైర్యం

అభిమానులకు నవీన్ నైతిక స్థైర్యం

యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి తన అభిమానులకు అండగా నిలుస్తున్నారు. తన మాటలతో వారికి ఓదార్పునిస్తున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. ఈ కష్టకాలంలో వారికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నారు.

ఇటీవల సాయి స్మరణ్ అనే నవీన్ పోలిశెట్టి అభిమాని తండ్రి కరోనాతో కన్నుమూశారు. సాయి స్మరణ్ తల్లి ఈ బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె మనసు వేరే పనుల మీదకు మరల్చేందుకు “జాతిరత్నాలు” సినిమాను తల్లికి చూపించాడు సాయి స్మరణ్.

ఆ సినిమా చూస్తూ మనసు తేలిక చేసుకుందా తల్లి. ఈ విషయాన్ని నవీన్ పోలిశెట్టికి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు సాయి స్మరణ్. నవీన్ పోలిశెట్టి వెంటనే మదర్ తో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. ప్రియమైన వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తను ఊహించగలనని, ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు. కరోనా కష్టాల్లో ఉన్న వారితో మాట్లాడి, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి అందరికీ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్