Sunday, January 19, 2025
Homeసినిమాక్రేజీ ప్రాజెక్ట్స్ తో వస్తున్న నవీన్ పోలిశెట్టి

క్రేజీ ప్రాజెక్ట్స్ తో వస్తున్న నవీన్ పోలిశెట్టి

పాండమిక్ క్రూషియల్ టైమ్ లో ‘జాతిరత్నాలు’ వంటి సూపర్ హిట్ ను ఇండస్ట్రీకి అందించి మంచి సినిమా చేస్తే ప్రతికూల పరిస్థితుల్లోనూ థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారని నిరూపించారు యువ హీరో నవీన్ పోలిశెట్టి. స్లో అండ్ స్టడీగా కొత్త సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్న ఈ యంగ్ టాలెంటెడ్ హీరో… ఈ ఏడాది పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో తెర పైకి రాబోతున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై నవీన్ పోలిశెట్టి అభిమానులతో ఛాట్ చేశారు. ఈ ఫన్ ఛాటింగ్ వీడియోను ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఇందులో అభిమానులు తన కొత్త సినిమాల సంగతులు చెప్పమని అడగగా.. వారిని సంతోషపెట్టే ఆన్సర్స్ చెప్పారు నవీన్. 2022లో తనకున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకున్న నవీన్ పోలిశెట్టి ఈ కొత్త ఏడాదిలో వరుస రిలీజ్ లతో తెర పై సందడి చేయబోతున్నారు. ఆయన ఖాతాలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అనుష్కతో కలిసి నటిస్తున్న సినిమాతో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో అనగనగా ఒక రాజు వంటి ఆసక్తికర చిత్రాలున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్