Saturday, January 18, 2025
HomeTrending Newsఇన్ఫార్మర్లకు నక్సల్స్ హెచ్చరిక

ఇన్ఫార్మర్లకు నక్సల్స్ హెచ్చరిక

విప్లవ ఉద్యమాన్ని నిర్మూలించడానికి పోలీసులు ఇచ్చే డబ్బులకు వ్యాపారస్తులు మరియు విప్లవ వ్యతిరేకులు  ఇన్ఫార్మర్లుగా మారవద్దని నక్సల్స్ విజ్ఞప్తి చేశారు. 2022 లోగా విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలనే పథకంలో భాగంగా బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా , రాజ్ నాథ్ సింగ్ ముఠా ఇన్ఫార్మర్లను పెంచి పోషిస్తున్నారని అన్నారు. ఈ మేరకు జయశంకర్ మహబూబాద్ వరంగల్ పెద్దపల్లి జెఎండబ్ల్యూపీ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఈ రోజు ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు

లేఖలోని ముఖ్య అంశాలు… వారి మాటల్లోనే
పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది ప్రమోషన్లకు రివార్డులకు కక్కుర్తి పడి లంపెన్ యువకులతో వ్యాపారస్తులతో సంబంధాలు పెట్టుకుని సమాచారం ఇవ్వండని డబ్బులు బహుమతిగా ఇస్తామని ప్రచారం చేస్తున్నారు.  సమాచారం ఆధారంగా దాడి చేస్తే ఎవరు చనిపోయిన వారిపై ఉన్న రివార్డు మీకే ఇస్తామని లేనిపోని ఆశలు కల్పిస్తూ వారిని పోలీసులు తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ప్రోత్సాహంతో కొంతమంది వ్యాపారస్తులు ప్రజలపై విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. పోలీసులకు మామూలు ఇస్తూ కిరాణం షాపులో వంట సరుకులకు ధరలు ఎక్కువగా తీసుకుంటూ.. కొత్త వ్యక్తులు కనబడ్డ వెంటనే సమాచారం చేరవేస్తున్నారు.


రాజకీయ నాయకులు పిన్నిరెడ్డి రాజిరెడ్డి, రామ్మోహన్ రావు, గుండె వెంకటస్వామి, చిన్నన్న, ఆలం సత్యనారాయణ, రాంబాబుతో పాటు మరికొంతమంది నాగారం, ఆజంనగర్, యామినపల్లి, పేడపల్లి, బోర్ల గూడెం, సూరారం, అంబటిపల్లి, పలిమెల, ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, కన్నాగూడెం, చిన్న బోయినపల్లి, షాపల్లి, మేడారం, నార్లాపూర్, కాటాపురం, చొక్కాల ఆలువాక తో పాటు మండల సెంటర్లో గ్రామాల్లో కూడా వ్యాపారస్తులు రక్షణ పేరుతో సీసీ కెమెరాలు పెడుతున్నారు. అడవిలో ప్రజలు ఎటు తిరిగిన దళాలు తిరిగినా కూడా ఫారెస్ట్ వాళ్లతో కెమెరాలు పెట్టించి ఫారెస్ట్ వారి నుండి దళాల ఆచూకీ తెలుసుకుంటున్నారు.

గోదావరి ప్రాంత ఓడరేవుల్లో నీలంపల్లి బుట్టాయిగూడెం ముకునూరు తుపాకుల గుడితో పాటు అనేక రేవుల్లో నిగా పెట్టి పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారు. నీలంపల్లిలో రేగ శ్రీను, వాసంలాలయ్య ముకునూర్ లో వెంకటస్వామి, చిన్నన్న.. తిప్పనపల్లి రవి ఆలం సత్యనారాయణ తో పాటు కొంతమంది… కొత్త వ్యక్తులు కనబడ్డ వెంటనే సమాచారం ఇస్తున్నారు. అడవిలోకి  వ్యక్తులను పంపుతూ సమాచారం సేకరిస్తూ పోలీసులకు చేరవేస్తున్నారు. ఆదివాసి సంఘాల పేరుతో పోడియం బాపు గుండ పాపారావు తో పాటు మరికొంతమంది పంచాయతీలు సెటిల్మెంట్ చేస్తూ లక్షల రూపాయలు తీసుకుంటున్నారని, వీరి పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల సమక్షంలో శిక్ష తప్పదని జె ఎం డబ్ల్యూ పి కార్యదర్శి హెచ్చరించారు.

Also Read : తెరాస, బిజెపిలకు నక్సల్స్ హెచ్చరిక

RELATED ARTICLES

Most Popular

న్యూస్