Saturday, January 18, 2025
HomeసినిమాNayanthara: బాలీవుడ్ ఎంట్రీని అదరగొట్టేసిన నయనతార! 

Nayanthara: బాలీవుడ్ ఎంట్రీని అదరగొట్టేసిన నయనతార! 

నయనతార హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతోంది. మలయాళ సినిమాతో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ తరువాత తమిళ సినిమాలతో బిజీ అయింది. అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చేస్తూ, అడపా దడపా మలయాళం నుంచి వచ్చిన అవకాశాలను కూడా ఉపయోగించుకుంటూ వెళ్లింది. ఈ మూడు భాషల్లోను నయనతారకి తిరుగులేదు. అది క్రేజ్ విషయంలో కావొచ్చు .. మార్కెట్ విషయంలో కావొచ్చు .. పారితోషికం విషయంలోనూ కావొచ్చు.

నయనతారకి గల క్రేజ్ కారణంగా ఆమెను లేడీ ఓరియెంటెడ్ కథలు ఎక్కువగా వెతుక్కుంటూ వచ్చాయి. ఆ సినిమాల ద్వారా ఆమెకి లభించిన క్రేజ్ కూడా ఎక్కువే. అలాంటి నయనతార సీనియర్ హీరోల సరసన నటిస్తూ తన కెరియర్ ను బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నుంచి ఆమెకి చాలా అవకాశాలు వచ్చాయి. అయితే తనకి బాగా పరిచయం ఉన్న దర్శకులతో చేయడానికి మాత్రమే ఆమె ఇష్టపడుతూ ఉంటుంది. అందువలన ఆమె బాలీవుడ్ వైపు చూడలేదు.

బాలీవుడ్ లో అవకాశాలను గురించి అడిగినప్పుడల్లా, అందుకు సరైన సమయం రావాలని నయనతార చెబుతూ వచ్చింది. అలాంటి సమయం ఆమెకి ‘జవాన్’ సినిమాతో వచ్చింది. అట్లీ కుమార్ తనకి బాగా తెలిసిన దర్శకుడు కావడంతో నయనతార ఈ సినిమాను ఒప్పుకుంది. ఈ సినిమా ఇప్పుడు వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. నయనతార నటనకి ప్రశంసలు లభిస్తున్నాయి. మొత్తానికి నయనతార బాలీవుడ్ లోను భారీ విజయంతోనే ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇకపై బాలీవుడ్ దిశగా కూడా ఆమె తన స్పీడ్ పెంచుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్