‘భారతీయులం ప్రతి ఒక్కరం ఏదో ఒక ఆట ఆడుదాం, ఉల్లాసంగా-ఆరోగ్యంగా ఉందాం’ అని జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా పిలుపు ఇచ్చాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ సందేశం ఇచ్చాడు. భారత దేశాన్ని ఓ గొప్ప క్రీడా దేశంగా తీర్చిదిద్దుదామని విజ్ఞప్తి చేశాడు.
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సంపాదించిన నీరజ్ చోప్రా వరల్డ్ ఛాంపియన్ షిప్స్ పోటీల్లో రజత పతకం గెల్చుకున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా కామన్ వెల్త్ గేమ్స్ కు దూరమైన నీరజ్ గతవారం స్విట్జర్లాండ్ లోని లసాన్నేలో జరిగిన డైమండ్ లీగ్ టోర్నీలో మొదటి స్థానంలో నిలిచి సెప్టెంబర్ 7,8 తేదీల్లో జ్యూరిచ్ లో జరిగే ఫైనల్స్ ఆడనున్నాడు.
Also Read : నీరజతం