Sunday, May 11, 2025
HomeTrending Newsవిధుల బహిష్కరణకు ఫోర్డా అల్టిమేటం

విధుల బహిష్కరణకు ఫోర్డా అల్టిమేటం

నీట్‌-పిజి 2021 కౌన్సిలింగ్‌ నిర్వహణ వాయిదాను నిరసిస్తూ రెసిడెంట్‌ వైద్యులు మంగళవారం కూడా న్యూఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీలోని సఫ్డర్‌గంజ్‌ ఆసుపత్రి నుండి కేంద్ర హోం శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఫోర్డా) నేతృత్వంలో ఈ మార్చ్‌ జరిగింది. కాగా, ఈ నిరసనలు సోమవారం నుండే జరుగుతున్నాయి. కౌన్సిలింగ్‌ ఆలస్యాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతుండగా.. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మంగళవారం సైతం ఇదే పరిస్థితి నెలకొంది. హోం శాఖ కార్యాలయానికి ర్యాలీగా వెళుతున్న రెసిడెంట్‌ డాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. కాగా, సోమవారం నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ప్రజాధనాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణలపై ఎపిడమిక్‌ డిసిజ్‌ యాక్ట్‌ కింద ఐపి ఎస్టేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న వైద్యులపై అభియోగాలు మోపారు. కాగా, బుధవారం నుండి దేశ వ్యాప్తంగా వైద్యసేవలను నిలిపివేయనున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఎఐఎంఎ) ప్రకటించింది. కాగా, ఇప్పటికే ఫోర్డా విధులను బహిష్కరించింది.

రేపటి నుంచి దేశావ్యాప్తంగా విధులు బహిష్కరిస్తామని రెసిడెంట్ డాక్టర్లు అల్టిమేటం ఇవ్వటంతో కేంద్రప్రభుత్వంలో కదలిక వచ్చింది. డాక్టర్ల యూనియన్ కు చెందిన 12 మంది ప్రతినిధుల బృందాన్ని అత్యవసరంగా చర్చలకు ఆహ్వానించింది. పిజి కౌన్సిలింగ్ వ్యవహారం కోర్టులో ఉండటంతో ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా న్యాయవివాదం తలెత్తుతుందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బుధవారం నుంచి తలపెట్టిన సమ్మె విరమించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవియ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఫోర్డా)కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పోలీసులు నిన్న నిరసన చేస్తున్న డాక్టర్లతో అమానుశంగా వ్యవహరించారని అందుకు  మన్నించాలని కేంద్రమంత్రి కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్