Saturday, January 18, 2025
Homeసినిమాపారితోషికం పెంచేసిన టిల్లు బ్యూటీ!

పారితోషికం పెంచేసిన టిల్లు బ్యూటీ!

సినిమా వాళ్లందరికీ కలిపి ఒక భాష ఉంటుంది .. అదే సినిమా భాష. అలాగే ప్రాంతం ఏదైనా అక్కడి ఆచార వ్యవహారాలన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. అక్కడ సక్సెస్ కి తప్ప మరోదానికి చోటు ఉండదు. అక్కడ సక్సెస్ మాట్లాడుతుంది .. పోట్లాడుతుంది .. పాటలు పాడుతుంది. అందువల్లనే అందరూ సక్సెస్ ను అందుకునే పనిలో పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అన్ని జబ్బులకు మందు అదే.

సక్సెస్ ఉంటేనే వరుస అవకాశాలు తలుపు తడతాయి. లేదంటే కాల్ చేసినా కట్ చేయని దాదాపుగా ఉండరు. అంతటి మహత్తు సక్సెస్ కి ఉంది. మరి అలాంటి సక్సెస్ చేతికి దొరికితే హీరోలు .. హీరోయిన్లు ఊర్కినే ఉంటారా .. వెంటనే పారితోషికం పెంచేయరూ. ఇప్పుడు సిల్కీ బ్యూటీ నేహా శెట్టి కూడా అదే పని చేసింది. ‘డీజే టిల్లు’ .. ‘టిల్లు స్క్వైర్’ సినిమాలు ఆమెకు మంచి విజయాలను తెచ్చి దోసిట్లో పెట్టాయి. దాంతో అమాంతంగా ఆమె పారితోషికం పెంచేసింది.

ఇదే విషయాన్ని నేహాను అడిగితే చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. ఏదైనా ఒక సంస్థలో కష్టపడి పనిచేస్తే, ప్రమోషన్ ఇచ్చి శాలరీ పెంచుతారు .. ఇక్కడ కూడా అంతే. ఒక పాత్రను బాగా చేస్తే .. ఒక సినిమా బాగా ఆడితే .. ఆ తరువాత సినిమాకి పారితోషికం పెరుగుతుంది. నిర్మాతలు కూడా ఇదంతా పరిగణనలోకి తీసుకునే కదా ఇస్తారు” అని చెప్పింది. ఆమె తాజా చిత్రమైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం జరగనుంది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్