నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ విశ్వాస పరీక్షలో ఓడిహాయారు. పార్లమెంటులో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఓలికి అనుకూలంగా 93, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. మొత్తం 275 మంది సభ్యులున్న పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య 271. సభలో నేటి ఓటింగ్ కి 234 మంది హాజరయ్యారు. ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఓలి ప్రభుత్వం మైనార్టీలో పడింది. నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి బలపరీక్షకు ఆదేశించారు. ఓలి తన రాజీనామాను విద్యా దేవికి సమర్పించనున్నారు.
2015లో సవరించిన నేపాల్ రాజ్యాగం ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు మిగిలిన పక్షాలకు కూడా విద్యా దేవి అవకాశం కల్పిస్తారు. కమ్యూనిస్ట్ పార్టిలోని మరోవర్గం మావోయిస్ట్ సెంటర్, నేపాలీ కాంగ్రెస్ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వుంది.