Tuesday, December 24, 2024
Homeసినిమాచరణ్ మూవీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ?

చరణ్ మూవీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ?

రామ్ చరణ్‌,  డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో  మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో సరసన  కైరా అద్వానీ నటిస్తుంది. ఈ క్రేజీ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  దిల్ రాజు నిర్మిస్తున్నారు.  డైరెక్టర్ శంకర్ తెలుగులో తెరకెక్కిస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా కథ ఏంటి..? ఏ తరహా సినిమా అంటూ సినీజనాలు ఆతృతగా అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉండబోతుందట. ఈ సినిమా పీరియాడిక్ పొలిటికల్ డ్రామా. బోస్ సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఆ కాలంలో బోస్ నుంచి ప్రేరణ పొందిన ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాలో ఓ ప్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారని సమాచారం. ఈ క్రమంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను కూడా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది.

శంకర్.. సుభాస్ చంద్రబోస్ పాత్ర తాలూకు డైలాగ్స్ పై చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలిసింది. ఇక ఈ సినిమాలో చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాలోనే చరణ్ క్యారెక్టర్ ప్రధాన హైలైట్‌ గా నిలుస్తుందట. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి. మరి.. చరణ్‌, శంకర్ కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్