Saturday, January 18, 2025
Homeసినిమావెబ్ సిరీస్ నటిస్తోన్న నాగ్?

వెబ్ సిరీస్ నటిస్తోన్న నాగ్?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంవత్సరంలో బంగార్రాజు మూవీతో సక్సెస్ సాధించారు. ఈ సినిమా కరోనా టైమ్ లో రిలీజ్ అయినప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది.  ఆ తర్వాత  నాగ్ నటించిన  బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రం కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ కు నార్త్ లో మంచి రెస్పాన్స్ రావడం విశేషం.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో  కింగ్ నటించిన ‘ది ఘోస్ట్‘ మూవీ దసరాకు విడుదలైంది. ఈ సినిమా పరాజయం పాలైంది.  ప్రస్తుతం బిగ్ బాస్ 6 కి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారని.. త్వరలోనే ఇది మొదలవుతుందని  ప్రచారం జరుగుతుంది. వెబ్ సిరీస్ లో నటించేందుకు ఇంట్రస్ట్ గానే ఉన్నారు కానీ.. ఇంకా ఏదీ కన్ ఫర్మ్ కాలేదని తెలిసింది.

రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో ఓ సినిమాను నాగ్ చేయనున్నారు.  స్టోరీ నచ్చడంతో అతనికే దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించారు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాతే వెబ్ సిరీస్ చేయడం గురించి ఆలోచిస్తాడట. అయితే.. నెట్ ఫ్లిక్స్ నాగార్జునతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్