Sunday, November 24, 2024
HomeTrending Newsఆధునిక సౌకర్యాలతో ఆర్టీసీకి కొత్త బస్సులు

ఆధునిక సౌకర్యాలతో ఆర్టీసీకి కొత్త బస్సులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మొదటిసారిగా టీఎస్‌ఆర్టీసీ కోసం కొత్త బస్సులు కొనుగోలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాతి పరిణామాలతో టీఎస్‌ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీఎస్‌ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. యాజమాన్యం నూతన బస్సులను కొనుగోలు చేసింది.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై కొన్ని కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను ఈ రోజు (శనివారం) రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, రవాణా, రహదారి మరియు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్దా ప్రకాశ్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డిలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించారు.
ట్రాకింగ్‌ సిస్టం.. పానిక్‌ బటన్
కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించడం జరిగింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయం కల్పించారు.
వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూం నకు సమాచారం అందుతుంది.
ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. అలాగే, ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్ డీఏఎస్) ఏర్పాటు చేయడం జరిగింది.
బస్సులో మంటలు చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగిన అలారం ఆటోమెటిక్గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్ డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు.
ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్