Sunday, January 19, 2025
Homeసినిమాగ‌ణేశ్ బెల్లంకొండ కొత్త చిత్రం ప్రారంభం

గ‌ణేశ్ బెల్లంకొండ కొత్త చిత్రం ప్రారంభం

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ బెల్లంకొండ మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా చేసిన తొలి రెండు చిత్రాల షూటింగ్‌ తుది దశకు చేరుకున్నాయి. ఎస్.వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై తొలి చిత్రంగా ‘నాంది’ వంటి డిఫ‌రెంట్ మూవీతో సూప‌ర్ హిట్ సాధించి అభిరుచి గ‌ల నిర్మాత‌గా నిరూపించుకున్న నిర్మాత స‌తీశ్ వ‌ర్మ త‌న బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.2 గా గ‌ణేశ్ బెల్లంకొండతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ‌ శిష్యుడు రాకేశ్ ఉప్ప‌ల‌పాటి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్‌కు రాకేశ్ స్క్రీన్ ప్లే రాయ‌గా, క‌థ‌ను అందించిన‌ ప్ర‌ముఖ ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య మాట‌లు, పాట‌ల‌ను కూడా రాస్తున్నారు. సోమ‌వారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్ట‌గా, హీరో అల్ల‌రి న‌రేశ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అనిత్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. అన్న‌య్య బెల్లంకొండ శ్రీనివాస్ స్టైల్లోనే గ‌ణేశ్ కూడా కెరీర్ ప్రారంభంలోనే వైవిధ్యమైన చిత్రాల‌ను ఎంపిక చేసుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్