Sunday, January 19, 2025
Homeసినిమాకొత్త ఏడాదిలో కొత్త భామల సందడి!

కొత్త ఏడాదిలో కొత్త భామల సందడి!

New Beauties: తెలుగు తెర అందమైన కథానాయికల అక్షయ పాత్రలా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది టాలీవుడ్ కి కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. అయితే క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఇక కరోనా కారణంగా క్రితం ఏడాది విడుదల కావలసిన సినిమాలు చాలా వరకూ ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలతో పాటు కొంతమంది కొత్త కథానాయికలు కూడా ఈ ఏడాది తెలుగు తెరకి పరిచయం కానున్నారు. క్రితం ఏడాది పరిచయమైన అందాల నాయికలలో కృతి శెట్టి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టగా, కేతిక శర్మ .. శ్రీలీల అంతగా ప్రభావం చూపలేకపోయారు.

ఇక ఈ ఏడాది విడుదల కానున్న ‘మేజర్‘ సినిమాతో ‘ సయీ మంజ్రేకర్’ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల తరువాత ఈ బ్యూటీకి అవకాశాలు పెరగవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘భీమ్లా నాయక్’ సినిమాతో సంయుక్త మీనన్ పరిచయం కానుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె రానా జోడీగా అలరించనుంది. ఈ సుందరి చేసిన ‘బింబిసార’ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకులను పలకరించనుంది.

ఇక విజయ్ దేవరకొండ – పూరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘లైగర్’ ద్వారా అనన్య పాండే పరిచయం కానుంది. ఈ బాలీవుడ్ భామకి ఆల్రెడీ ఇక్కడ అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ తరువాత ఇక్కడ ఆమె జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయనే టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది. అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ద్వారా టాలీవుడ్ కి సాక్షి వైద్య పరిచయం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే థియేటర్లకు రానుంది. తెలుగు తెరకి కొత్త అందాలను పరిచయం చేయనున్న ఈ నాజూకు భామలలో ఎవరెన్ని మార్కులు కొట్టేస్తారో .. ఎవరెన్ని మనసులను పట్టేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్