పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్ వరకు చేయిపట్టుకుని నడిపించే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పాలసీలో మార్కెటింగ్ టై-అప్ విధానంపై దృష్టి సారించాలని కోరారు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలశాఖతో సిఎం జగన్ సమీక్షా సిఎం జగన్ ప్రాథమిక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
- అంతర్జాతీయంగా మార్కెటింగ్ టైఅప్ చేయగలిగితే ఎంఎస్‌ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతాం
- ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయి
- కాన్సెప్ట్ నుంచి కమిషనింగ్ మొదలుకుని మార్కెటింగ్ వరకు హేండ్ హోల్డింగ్‌గా ఉండాలి, అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్‌గా ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలి
- స్టార్టప్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం. విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలి
- మంచి లొకేషన్‌లో భవనాన్ని నిర్మించాలి, అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాయం కూడా ఉండాలి
- స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి
- పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పనదిశగా దృష్టిసారించాలి
- ఈ అంశాల ప్రాతిపదికగా ఇండిస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలి
ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ కార్యదర్శులు కే వీ వీ సత్యనారాయణ, గుల్జార్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.