New Medical Colleges Start Next Year :
వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాక హరీష్ రావు ఈ రోజు నీలోఫర్ ఆసుపత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసీయీ వార్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వైద్యమంత్రిగా మొదటి కార్యక్రమం నిలోఫర్ ఆసుపత్రిలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజి ఉండాలని ప్రభుత్వ సంకల్పమన్నారు. 33 కోట్ల రూపాయలతో నీలొఫర్ లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.
హైసీయా, నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అన్నారు…తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. కరోనా మూడో వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5000 పడకలు ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం సీఎం రు. 133 కోట్లు విడుదల చేసిందన్నారు.
కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఈ రమేష్ రెడ్డి, నిలోఫర్ సూపరింటెండెంట్ మురళి కృష్ణ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హైసియా ఎండి భరణి, నిర్మాన్, ఇన్ఫోసిస్, ఓపెన్ టెక్స్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిలోఫర్ లో మరో 25 ఐసియు పడకలను 1.75 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్, నిర్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి..
ఇవి కూడా చదవండి: హరీశ్ రావుకు కీలక బాధ్యతలు