Saturday, January 18, 2025
Homeసినిమానూతన నిర్మాణ సంస్థ శ్రీ ఇష్టకామేశ్వర క్రియేషన్స్

నూతన నిర్మాణ సంస్థ శ్రీ ఇష్టకామేశ్వర క్రియేషన్స్

దర్శకత్వశాఖలో మంచి అనుభవం కలిగి, “ప్రేమంటే సులువు కాదురా” చిత్రంతో దర్శకుడిగా పరిచయమై… తొలి చిత్రంతోనే తన ప్రతిభను నిరూపించుకున్న యువ ప్రతిభాశాలి ‘చందా గోవిందరెడ్డి నిర్మాతగా మారుతున్నారు. స్వీయ దర్శత్వంలో ఓ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న గోవిందరెడ్డి…తన సొంతూరులో విలసిల్లుతున్న శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి పేరిట ‘శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్’  నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ బ్యానర్ లోగోను సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. సీనియర్ దర్శకులు కె.సాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొని… చందా గోవిందరెడ్డికి శుభాశీస్సులు అందించారు. తన చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకున్న “శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్” అంచెలంచెలుగా టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చోటు సంపాదించుకోవాలని వి.వి.వినాయక్ ఆకాంక్షించారు.

సీనియర్ దర్శకులు సాగర్ సమక్షంలో… సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్… మా “శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్” లోగో లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉందన్నారు చందా గోవింద రెడ్డి. తమ బ్యానర్ లో రూపొందే చిత్రం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో “రఫ్” చిత్ర దర్శకులు సుబ్బారెడ్డి, సీనియర్ కో-డైరక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్