Saturday, April 20, 2024
Homeసినిమాభూపాల్ రెడ్డి చేతులమీదుగా ‘రుద్రవీణ’ ప్రీ లుక్ పోస్టర్

భూపాల్ రెడ్డి చేతులమీదుగా ‘రుద్రవీణ’ ప్రీ లుక్ పోస్టర్

Latest Veena: ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘రుద్రవీణ’ .రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ  హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “రుద్రవీణ’.ఈ చిత్రం  షూటింగ్ పూర్తి చేసుకుని ప్రోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి-లుక్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. నల్గొండ యమ్.యల్.ఏ. కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా లు ముఖ్య అతిధులుగా హాజరై ప్రి లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ “ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్. రుద్రవీణ కు నాకు ఒక చిన్న లింక్ ఉంది. నాకు చినప్పటినుండి చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. పక్కన 175 డేస్ సినిమాలు వున్నా చూసే వాన్ని కాదు. మారుమూల గ్రామంలో వుండే నేను గత 30 సంవత్సరాల నుండి సినిమా తీయాలని ఉండేది. దానికోసం నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను.అయినా కూడా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ గా నిలిచారు. వారందరికి ధన్యవాదాలు. అలాగే మెగాస్టార్ కు కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు రుద్రవీణ టైటిల్ వచ్చినందుకు. చిరంజీవి అంటే నాకు ఎంతో సెంటిమెంట్. అందుకే నా మొదటి సినిమాను ఆయన నటించిన “రుద్రవీణ” టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా మెచ్చుకుంటారు. ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు” అన్నారు.

దర్శకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ “ఇక్కడకు పెద్దలందరికీ ధన్యవాదాలు.ఇది నా రెండవ సినిమా చిరంజీవి గారి రుద్రవీణ సినిమా వచ్చినపుఫు నేను పుట్టాను. ఈ చిత్రాన్ని టివి లో చూస్తున్నపుడు నాకు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో రుద్రవీణ టైటిల్ తో డీఫరెంట్ గా మంచి యాక్షన్ సినిమా తీయాలని ఈ కథ రాయడం జరిగింది. ఇందులో రఘు గారు, చంటి,  హీరోహీరోయిన్ ఇలా అందరూ చాలా చక్కగా నటించారు. జి ఎల్ బాబు గారు తన కెమెరా పనితనంతో ఈ కథకు చాలా న్యాయం చేశాడు. తరువాత నేను ఏ సినిమా తీసిన బాబన్న నే కెమెరామెన్ గా పెట్టుకుంటా.. ఇందులో బంగారు బొమ్మ పాటకు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.  ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైనా ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు లక్ష్మణ్ గారు..చిత్ర యూనిట్ అంతా సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది.అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది” అన్నారు.

ఈ సినిమాలో విలన్ గా నటించిన రఘు కుంచే  మాట్లాడుతూ.. పలాస సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత నాకు  విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి.ఈ సినిమాకు చాలా మంది ఆర్టిస్టులు పనిచేశారు. చక్కటి కథను సెలెక్ట్ చేసుకుని సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు దర్శకుడు. నిర్మాత ఖర్చుకు వెనుకడకుండా అద్భుతంగా నిర్మించారు.ఫుల్ ప్యాకేజ్డ్ గా వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా చిన్న సైజు అఖండ లా అద్భుతంగా తీశారు. యాక్షన్ కూడా ఇందులో భారీగా ఉంటుంది.   భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. పాటలు,  సినిమా చాలా బాగా వచ్చాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Also Read : సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ఫస్ట్ లుక్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్