Sunday, January 19, 2025
Homeసినిమా‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ప్రారంభం

‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ప్రారంభం

New production house: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ బ్యానర్ ని లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం 1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ కి శ్రీకారం చుట్టిన అన్నయ్య జయకృష్ణ గారికి అభినందనలు. ఇది మా సొంత బ్యానర్ . మా అన్నదమ్ములందరి బ్యానర్. మా అమ్మ గారు, నాన్నగారి పేర్లు కలిసోచ్చేలా ‘బసవతారకరామ’ అని బ్యానర్ కి పేరు పెట్టడం చాలా ఆనందంగా వుంది. ఈ బ్యానర్ ద్వారా నందమూరి చైతన్య కృష్ణ హీరో గా పరిచయం కావడం ఆనందంగా వుంది. నాన్నగారికి చైతన్య కృష్ణ చాలా ఇష్టమైన మనవడు. చైతన్య కృష్ణ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. చాలా వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళకు నా బెస్ట్ విషెస్. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ “మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ ఈ బ్యానర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ద్వారా మా అబ్బాయి చైతన్య కృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు.

హీరో చైతన్య కృష్ణ మాట్లాడుతూ “నాన్నగారు స్థాపించిన ‘బసవతారకరామ క్రియేషన్స్’బ్యానర్ ని బాబాయ్ బాలకృష్ణ గారు లాంచ్ చేయడం, ఆశీస్సులు అందించడం చాలా ఆనందంగా వుంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్