Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల ఓటర్ల జాబితాని విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరువ కాగా, ఏపీలో 4 కోట్లకు దగ్గరైంది. ప్రతి సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం సవరణల త‌ర్వాత‌ జనవరిలో ఓటర్ల తుది జాబితాలను ప్రకటించడం ఆనవాయతీగా వ‌స్తోంది.

తాజాగా ప్రకటించిన జాబితాల ప్రకారం…

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య- 2,99,92,941
పురుష ఓటర్ల సంఖ్య- 1,50,48,250
మహిళా ఓటర్ల సంఖ్య- 1,49,24,718
థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 1,951
సర్వీసు ఓటర్ల సంఖ్య- 15,282
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య- 42,15,456
రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 31,08,068
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 25,24,951
అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి (6,44,072)
అతి తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం (1,42,813)

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 3,99,84,868
ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య- 2,02,19,104
ఏపీలో పురుష ఓటర్ల సంఖ్య- 2,01,32,271
ఏపీలో సర్వీసు ఓటర్ల సంఖ్య- 68,162
థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 3,924
అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా కర్నూలు (19,42,233)
అతి తక్కువగా ఓటర్లు కలిగి వున్న జిల్లా (7.29,085)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com