Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: ఇండియాపై న్యూజిలాండ్ విజయం

మహిళల వరల్డ్ కప్: ఇండియాపై న్యూజిలాండ్ విజయం

Kiwis won: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో  నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్  62 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీకి ముందు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను 4-1తో  ఇండియా కోల్పోయిన సంగతి తెలిసిందే.

హామిల్టన్ లోని సెడ్డాన్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ మహిళలు 9 పరుగులకే తొలి వికెట్ (సుజ్జీ బేట్స్- 5-రనౌట్) కోల్పోయారు. సత్తార్ వైట్ 75 పరుగులతో రాణించగా, కొంత కాలంగా మంచి ఫామ్ లో ఉన్న అమేలియా కెర్ర్ అర్ధ సెంచరీ చేసింది. కాటీ మార్టిన్ -41; కెప్టెన్ సోఫీ డివైన్- 35; మడ్డీ గ్రీన్-27 పరుగులతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో పూజా వస్త్రాకర్ నాలుగు; గాయక్వాడ్ రెండు; గోస్వామి, దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు.

ఇండియా 10 పరుగులకే తొలి వికెట్   (స్మృతి మందానా -6), 26 వద్ద రెండో వికెట్ (దీప్తి శర్మ-5) కూడా కోల్పోయింది.  ఇండియా మహిళల్లో హార్మన్ ప్రీత్ కౌర్ ఒక్కరే 71 పరుగులతో రాణించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ -31; యస్తికా భాటియా – 28 పరుగులు చేశారు. 46.6 ఓవర్లలో 198 పరుగులకే ఇండియా ఆలౌట్ అయ్యింది. కివీస్ బౌలర్లలో లియా తుహుహు, అమేలియా కెర్ర్ చెరో మూడు; హేలీ జేన్సేన్ రెండు; జేస్ కెర్ర్, హన్నా రో చెరో వికెట్ పడగొట్టారు.

75 పరుగులు చేసిన కివీస్ బాట్స్ విమెన్ సత్తార్ వైట్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్