Wednesday, May 8, 2024
Homeస్పోర్ట్స్Tom Latham: తొలి వన్డేలో కివీస్ విజయం

Tom Latham: తొలి వన్డేలో కివీస్ విజయం

కెప్టెన్ కేన్ విలియమ్సన్- టామ్ లాథమ్ 221 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో రాణించడంతో ఇండియాతో జరిగిన మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 306 పరుగులు చేయగా ఈ లక్ష్యాన్ని  47.1 ఓవర్లలో ఛేదించింది. లాథమ్ 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 145;  కేన్ 98 బంతుల్లో  7 ఫోర్లు, 1 సిక్సర్ తో 94 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

  • శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్లో లాథమ్ ఒక సిక్సర్, నాలుగు ఫోర్లు, ఒక సింగిల్ తో 23 పరుగులు చేయగా, మరో రెండు వైడ్స్ రూపంలో….. మొత్తం 25 రన్స్ లభించాయి.
  • లాథమ్ తన వన్డే కెరీర్ లో హయ్యస్ట్ స్కోరు (145*) సాధించాడు.

ఆక్లాండ్ లోనిఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా తొలి వికెట్ కు 124 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ అర్ధ సెంచరీ చేసి ఔటయ్యాడు.  అదే స్కోరు వద్ద ….ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ ధావన్ (72) కూడా పెవిలియన్ చేరాడు. పంత్ (15);  సూర్య కుమార్ యాదవ్ (4) లు  విఫలమయ్యారు. ఒకే ఓవర్లో ఫెర్గ్యూ సన్ వీరిద్దరినీ అవుట్ చేయడం విశేషం. ఆ తర్వాత  శ్రేయాస్ అయ్యర్- సంజూ శామ్సన్ లు ఐదో వికెట్ కు 94 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. శామ్సన్  36  రన్స్ చేయగా, శ్రేయాస్ 76 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లతో 80 పరుగులు చేశాడు.  చివర్లో వాషింగ్ టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 16 బంతుల్లో 3 ఫోర్లు, 3  సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు, ఇన్నింగ్స్ చివరి బంతికి శార్దూల్ ఠాకూర్ ఔటయ్యాడు. నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 306పరుగులు చేసింది.

 కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్, సౌతీ చెరో మూడు; మిల్నే ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో కివీస్ జట్టు 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు ఫిన్ అల్లెన్-22; డెవాన్ కాన్వే-24; డెరిల్ మిచెల్-11  పరుగులు చేసి ఔటయ్యారు.  ఇండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు; అర్ష్ దీప్ సింగ్  ఒక వికెట్ పడగొట్టారు.

టామ్ లాథమ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్