Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్రెండో వన్డేలోనూ కివీస్ మహిళలదే విజయం

రెండో వన్డేలోనూ కివీస్ మహిళలదే విజయం

Kiwis w won 2nd also: న్యూజిలాండ్  తో జరిగిన రెండో వన్డేలోనూ  ఇండియా మహిళల జట్టు పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 270 పరుగులు చేసినా ఆ స్కోరును కాపాడుకోవడంలో విఫలమైంది.  కివీస్ క్రీడాకారిణి అమేలియా కెర్ర్  అద్భుతంగా ఆడి సెంచరీ చేయడంతో  మరో ఓవర్ మిగిలిఉండగానే ౩ వికెట్లతో విజయం సాధించింది.  అమేలియా 135 బంతుల్లో 7 ఫోర్లతో 119 పరుగులతో అజేయంగా నిలవగా మ్యాడీ గ్రీన్-52; ఓపెనర్ సోఫీ డేవిస్-33తో రాణించి జట్టు విజయంలో తోడ్పడ్డారు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు; రాజేశ్వరి గయక్వాడ్, పూనం యాదవ్; హార్మన్ ప్రీత్ కౌర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

క్వీన్ స్టోన్స్ లోని జాన్ డేవిస్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు షెఫాలీ- మేఘన తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. షె ఫాలీ 24 పరుగులు చేసి అవుట్ అయ్యింది. మేఘన 49 పరుగులు చేసి ఒక్క పరుగుతో అర్ధ సెంచరీ మిస్ చేసుకుంది. యస్తికా భాటియా 31 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.  ఐదో వికెట్ కు కెప్టెన్ మిథాలీ రాజ్- రిచా ఘోష్ 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఘోష్ 65 పరుగులు చేయగా, మిథాలీ 66 తో అజేయంగా నిలిచింది. నిర్ణీత యాభై ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది.  కివీస్ బౌలర్లలో  సోఫీ  డేవిస్ రెండు; జెస్ కెర్ర్, అమేలియా కెర్ర్, రోజ్ మేరీ, ఫ్రాన్ జోనాస్ తలా ఒక వికెట్ సాధించారు.

సెంచరీతో అజేయంగా నిలవడంతో పాటు ఓ వికెట్ కూడా సాధించిన అమేలియా కెర్ర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో కీవీస్ 2-0 ఆధిక్యంతో నిలిచింది. ఇదే వేదికగా మూడో వన్డే ఫిబ్రవరి 18న జరగనుంది.

Also Read : తొలి వన్డేలో కివీస్ మహిళల గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్