Sunday, January 19, 2025
HomeసినిమాNeymar: వీధికుక్క చుట్టూ తిగిగే వినోదభరితమైన కథనే 'నెయ్ మర్' 

Neymar: వీధికుక్క చుట్టూ తిగిగే వినోదభరితమైన కథనే ‘నెయ్ మర్’ 

మల్లూవుడ్ లో స్టార్స్ ఉన్నారు .. అక్కడి సినిమాలు కూడా వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉన్నాయి. అయితే స్టార్స్ తో సంబంధం లేకుండా నడిచే కథలు .. అలాంటి కథలను సహజంగా తెరకెక్కించడం అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. రెండున్నర గంటల సేపు ఆడియన్స్ ను థియేటర్లలో కూర్చోబెట్టడానికి నానా హడావిడి చేయవలసిన అవసరం లేదు .. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఒక సింపుల్ లైన్ చాలు అనే ధోరణిలోనే అక్కడి మేకర్స్ ఉంటారు. అలాంటి మేకర్స్ నుంచి వచ్చిన సింపుల్ బడ్జెట్ సినిమానే ‘ నెయ్ మర్’.

ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఒక గ్రామానికి చెందిన ఇద్దరు ఫ్రెండ్స్ .. ఒక కుక్క. మరో ప్రాంతానికి చెందిన ఇద్దరు శత్రువులు .. ఒక కుక్క. ఈ పాత్రల చుట్టూనే దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కనిపించకుండా పోయిన తమ కుక్కను వెతుక్కుంటూ ఇద్దరు యువకులు మరో ఊరు వెళతారు. అక్కడ ఓ ముఠానాయకుడి అధీనంలో తమ కుక్క ఉండటం చూస్తారు. అతను ఒక బలమైన కారణంతో దానిని చేరదీశాడనే విషయం తెలుసుకుంటారు.

తన అవసరం తీరిన తరువాత వాళ్ల సంగతి చూడాలని ముఠానాయకుడు అనుకుంటాడు. అతని కళ్లుగప్పి తమ కుక్కను తీసుకుపోవాలని ఈ ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తారు. కానీ ఆ కుక్కపై ఆ యువకులు పెంచుకున్న ప్రేమను చూసి దానిని వాళ్లకే వదిలేయాలని ముఠా నాయకుడు నిర్ణయించుకుంటాడు. తమకంటే బాగా చూసుకుంటున్న అతని దగ్గరే ఆ కుక్క ఉండటం మంచిదని ఆ కుర్రాళ్లు భావిస్తారు. చివరికి ఆ రెండు కుటుంబాల మధ్య ఒక స్నేహపూర్వకమైన అనుబంధం ఏర్పడుతుంది. చిన్నపిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేసే ఈ సినిమాకి, హాట్ స్టార్ లో ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్