Saturday, January 18, 2025
Homeసినిమాప్రేమ పంచమంటున్నఅందాల ‘నిధి’

ప్రేమ పంచమంటున్నఅందాల ‘నిధి’

అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నిధి అగర్వాల్. ఆతర్వాత అక్కినేని అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలతో టాలెంటెడ్ యాక్ట్రస్ అనిపించుకున్న ఈ అందాల నిధి రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో నిధి అగర్వాల్ కు క్రేజ్ పెరిగింద. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

ఇదిలా ఉంటే.. కరోనా సెకండ్ వేవ్ బాధితులకు అండగా నిలిచేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకువచ్చారు. నిధి అగర్వాల్ కూడా తన వంతు సాయాన్ని అందిస్తుంది. తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మ‌డు డిస్ట్రిబ్యూట్ ల‌వ్ పేరుతో ఓ ఆర్గ‌నైజేష‌న్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి ఓ వైబ్‌సైట్‌ను స్టార్ట్ చేసింది. క‌ష్ట కాలంలో మందులు, నిత్యావ‌స‌ర వ‌స్తువులు వంటి సాయం కావాల‌నుకున్న వాళ్లు ఈ వెబ్ సైట్ ద్వారా రిక్వెస్ట్ పంపితే తనకు చేత‌నైనంత స‌హయం అందిస్తాన‌ని నిధి అగ‌ర్వాల్ తెలిపింది. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్