Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్CWG-2022:  ఫైనల్లో జరీనా, సెమీస్ లో సింధు

CWG-2022:  ఫైనల్లో జరీనా, సెమీస్ లో సింధు

కామన్ వెల్త్ గేమ్స్ లో తెలుగు తేజాలు నిఖత్ జరీన్, పివి సింధు నేడు జరిగిన మ్యాచ్ ల్లో విజయం సాధించి పతకం రేసులో దూసుకెళ్తున్నారు.

మహిళల లైట్ ఫ్లై వెయిట్ 50 కిలోల విభాగంలో నిఖత్ జరీన్ ఫైనల్లో అడుగు పెట్టింది. నేడు జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ బాక్సర్ షవన్నా స్టబ్లీపై 5-0 తేడాతో విజయం సాధించింది. రేపు జరిగే గోల్డ్ మెడల్ పోరులో ఉత్తర ఐర్లాండ్ కు చెందిన కార్లీ మెక్ నుల్ తో తలపడనుంది.

మరోవైపు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పివి సింధు సెమీఫైనల్ కు చేరుకుంది. నేడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మలేషియా క్రీడాకారిణి గో జీ విన్ పై 19-21; 21-14;21-18 తేడాతో విజయం సాధించింది. రేపటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో సింగపూర్ కు చెందిన యో జియా మెన్  తో ఆడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular