Saturday, March 2, 2024
HomeTrending Newsమూడు రోజులు భారీ వర్షాలు

మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న 3 రోజుల్లో బలమైన అల్పపీడనం కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్ లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఆగష్టు 7-9 మధ్యలో భారీ వర్షాలు కురియనున్నాయి. దీని కారణంగా గోదావరి నదికి మరొకసారి తీవ్రమైన వరద వచ్చే ప్రమాదముంది, కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం ప్రారంభం అయ్యాయి. ఆగష్టు 7-9 మధ్యలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జనగామ, ఖమ్మం, సూర్యాపేట లో మోస్తారు – భారీ వర్షాలు, మిగతా జిల్లాలో తేలికపాటి – మోస్తారు వానలు పడే అవకాశం ఉంది…

హైదరాబాద్ లో రానున్న 3 రోజులు ముసురు ఉండి, చల్లగా మోస్తారు వానలు పడనున్నాయి. ఉత్తర తెలంగాణలోని ప్రజలందరూ రానున్న 3 రోజులు చాలా అప్రమతంగా ఉండాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్