Sunday, January 19, 2025
HomeసినిమాThe India House: నిఖిల్ తో చరణ్ భారీ సినిమా

The India House: నిఖిల్ తో చరణ్ భారీ సినిమా

రామ్ చరణ్, తన స్నేహితుడు యువీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా అక్కినేని అఖిల్ తో సినిమా నిర్మించనున్నాడని వార్తలు వచ్చాయి కానీ.. ఊహించని విధంగా యంగ్ హీరో నిఖిల్ తో సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ వంశీ కృష్ణ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ ఇంట్రస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. 1900 దశకంలో భారతదేశ చరిత్ర పుటల్లో లేని ఓ అధ్యాయాన్ని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ చిత్రానికి ‘ది ఇండియా హౌస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని వి మెగా పిక్చర్స్ తో కలిసి అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే అంచనాలు పెంచేశారు. ‘కార్తికేయ 2’, ‘స్పై’.. ఇలా విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకెళుతున్న నిఖిల్ ఇప్పుడు రామ్ చరణ్ బ్యానర్ లో సినిమా చేస్తుండడం ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. స్పై చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో జూన్ 29న విడుదల చేస్తున్నారు. మరి.. ది ఇండియా హౌస్ మూవీతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్