Sunday, January 19, 2025
Homeసినిమానిర్మాత తో గొడవ గురించి క్లారిటీ ఇచ్చిన నిఖిల్

నిర్మాత తో గొడవ గురించి క్లారిటీ ఇచ్చిన నిఖిల్

నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించి అందరికీ సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమాతో నిఖిల్ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయి షాక్ ఇచ్చాడు. దాంతో నిఖిల్ తో సినిమా చేసేందుకు మేకర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ ‘స్పై’ అంటూ వస్తున్నాడు. ఇది సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.

స్పై మూవీని జూన్ 29న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్స్ చేయడానికి టైమ్ కావాలని.. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయమని నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డికి చెబితే.. అలా చేయనని.. అనౌన్స్ చేసినట్టుగా 29నే విడుదల చేస్తానని చెప్పాడని.. ఇక అప్పటి నుంచి హీరో, నిర్మాత మధ్య గొడవలు మొదలయ్యాయని వార్తలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై నిఖిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్పందించాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే..
విడుదల తేదీని వాయిదా వేయమని నిర్మాతలను అభ్యర్థించడం తనకు ఆందోళన కలిగించే విషయమని నిఖిల్ స్వయంగా అన్నారు.

దాదాపు 2000 మంది ఈ చిత్రానికి పని చేసారు. కేవలం నిర్మాణం మాత్రమే కాకుండా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. తక్కువ నాణ్యత మనందరి పై ప్రభావం చూపుతుంది కాబట్టి అవుట్ పుట్ గురించి నేను ఆందోళన చెందుతాను కానీ.. నిర్మాతలు సినిమా చూపించి నన్ను సంతృప్తిపరిచారు. దర్శకుడు కూడా నన్ను చాలా సంతృప్తిపరిచారు అన్నారు.  ఆ కారణంగానే ఈ రోజు నేను కాస్త ఆలస్యమైనా ప్రెస్ మీట్ కి వచ్చి ప్రమోట్ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను అని ట్రైలర్ లాంచ్ వేడుకలో నిఖిల్ అన్నారు. నిఖిల్ మాటలను బట్టి నిర్మాతతో గొడవ అని వచ్చిన వార్తల్లో వాస్తవం ఉందనేది చెప్పకనే చెప్పాడు. అదీ.. మేటరు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్