Saturday, January 18, 2025
Homeసినిమానిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పై

నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పై

SPY: యంగ్ హీరో నిఖిల్ న‌టించ‌నున్న‌ కొత్త సినిమా స్పై. ఇది నిఖిల్ 19వ ప్రాజెక్ట్ కాగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ‘స్పై’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిఖిల్ చేతిలో షాట్ గన్‌ పట్టుకుని, సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కాగా “స్పై” మూవీతో నిఖిల్ పాన్ ఇండియా రేసులోకి అడుగు పెడుతుండడం విశేషం.

‘స్పై’చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ దసరా కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథ అందించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ‘స్పై’ థ్రిల్లర్‌లో అభినవ్ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ కు హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్