Wednesday, April 16, 2025
HomeTrending Newsపెట్రో రేట్లను మరింత తగ్గించిన తొమ్మిది రాష్ట్రాలు

పెట్రో రేట్లను మరింత తగ్గించిన తొమ్మిది రాష్ట్రాలు

Nine States Have Further Reduced Petrol Rates :

దీపావళి వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 తగ్గాయి. ఈ తగ్గింపు ధరలు ఈ రోజు (గురువారం) ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో 9 బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాయి. ఈ జాబితాలో అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి.

కాగా అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ. 7 తగ్గించాయి. మరోవైపు యూపీ ఏకంగా రూ. 12 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ మాత్రం రూ. 2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలకు పెట్రోల్ మరింత చౌకగా అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్ ధరలను తగ్గించాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి.

పెట్రోల్ రేట్లపై పన్ను తగ్గించే విషయంలో తెలుగు రాష్ట్రాలు కూడా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Must Read :సిఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్