Thursday, May 8, 2025
Homeసినిమానడ్డాతో నితిన్ భేటీ

నడ్డాతో నితిన్ భేటీ

బిజెపి  జాతీయ అధ్య‌క్షుడు జగత్ ప్రకాష్  న‌డ్డాను  హీరో నితిన్ కలుసుకున్నారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభలో  పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన నడ్డా తొలుత క్రికెట్ ప్లేయర్ మిథాలీ రాజ్ ను కలుసుకుని ఆమెతో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం హన్మకొండ వెళ్లి బహిరంగ సభలో పాల్గొన్న అనతరం తిరిగి శంషాబాద్ లోని హోటల్ నోవా టెల్ లో నితిన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బిజెపి రాజ్య సభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, సీనియర్ నేత ఎన్. రామచంద్రరావు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్