Wednesday, January 22, 2025
Homeసినిమాఆ హీరో నన్ను వేధించాడు: నిత్యా మీనన్

ఆ హీరో నన్ను వేధించాడు: నిత్యా మీనన్

నిత్యామీనన్. స్కిన్ షో చేయకుండా.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది. సింగర్ గా కూడా నిత్యా కొనసాగుతోంది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న నిత్యా.. తాజాగా ఒక కోలీవుడ్ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. ఒక కోలీవుడ్ హీరో నన్ను చాలా వేధించాడు. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతూ ఇబ్బందిపెట్టేవాడు. అతడివలన షూటింగ్ కు వెళ్లాలంటే భయమేసేది. చాలాసార్లు షూటింగ్ కు కూడా వెళ్లలేకపోయేదాన్ని. మహిళలు పని చేసే ప్రదేశాల్లో లైంగిక ఇబ్బందులకు గురైతే! పని చేయడం చాలా కష్టం. ఇక టాలీవుడ్ లో అలాంటి సంఘటనలు జరగలేదు. ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ” అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం నిత్యా వ్యాఖ్యలు కోలీవుడ్ లో కలకలం రేపాయి. నిత్యాను ఇబ్బంది పెట్టిన ఆ హీరో ఎవరు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. నిత్యా.. కోలీవుడ్ లో సైతం స్టార్ హీరోలతోనే వర్క్ చేసింది. ఇలా హీరోల మీద ఆరోపణలు చేయడం మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె ఒక నిర్మాతపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తప్పుడు ఉద్దేశ్యంతో చూస్తూ.. ఒక నిర్మాత తనను ఇబ్బంది పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అప్పుడు అంత సీరియస్ కాకపోవడంతో ఎవరు పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు స్టార్ హీరో అనడంతో అందరూ ఆ హీరో గురించే మాట్లాడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్