చంద్రబాబు రావాలని ఎవరూ కోరుకోవడం లేదని, అయన వస్తే దుర్భిక్షం, అరిష్టం వస్తుందని అందుకే మళ్ళీ రాకూడదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోరుకున్నట్లు వచ్చే ఎన్నికలే ఆయనకు చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు. మనం ఏదైనా అనుకుంటే దేవుడు తథాస్తు అంటాడని… మనం మంచి అనుకుంటే మంచి, చెడు అందుకుంటే చెడు జరుగుతుందని, బాబు రావడం మంచిది కాదు కాబట్టి అదే జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే, పేదవాడికి పట్టెడన్నం దొరకాలంటే బాబు మళ్ళీ సిఎంగా రాకూడదని, ఇది శాసనమని బొత్స అన్నారు.
మానవత్వం ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరూ కుటుంబ సభ్యులను దూషించారని, కానీ తన కుటుంబాన్ని ఎవరో ఏదో అన్నారని బాబు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని బొత్స విమర్శించారు. భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చాడని… బాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని… అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల గురించే ఆలోచిస్తారని అన్నారు.
Also Read : బాబువి సానుభూతి డ్రామాలు: అప్పలరాజు