Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్జకోవిచ్ చరిత్ర తిరగరాసేనా?

జకోవిచ్ చరిత్ర తిరగరాసేనా?

To create history: సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ వింబుల్డన్ ఫైనల్లో ప్రవేశించాడు. నేడు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో బ్రిటన్ ఆటగాడు కామెరాన్ నోరీ పై 2-6;6-3;6-4;6-4 తో విజయం సాధించాడు.  తొలి సెట్ ను చేజార్చుకున్న జకోవిచ్ ఆ తర్వాత తేరుకొని తన మార్కు ఆట తీరుతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాడు నికీ కిర్గియోస్ తో జకోవిచ్ తలపడనున్నాడు.

ఇప్పటికే 20 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెల్చుకొని రోజర్ ఫెదరర్ తో సమానంగా ఉన్న జకోవిచ్ ఈసారి వింబుల్డన్ టైటిల్ గెల్చుకొని  అత్యధిక టైటిల్స్ గెల్చుకున్న రెండో ఆటగాడిగా చరిత్ర తిరగ రాయాలనుకుంటున్నాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ విజేతగా నిలిచి ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ లు గెల్చుకున్న ఆటగాడిగా స్పెయిన్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని కారణంగా ఆ రెండు టోర్నీలకు జకోవిచ్ దూరం కావాల్సి వచ్చింది.

మరోవైపు నాదల్ గాయం కారణంగా సెమీస్ పోరు నుంచి అర్ధంతరంగా వైదొలగడంతో వాకోవర్ ద్వారా కిర్గియోస్ ఫైనల్స్ చేరుకున్నాడు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది వింబుల్డన్ ఫైనల్లో నాదల్- జకోవిచ్ మధ్య హోరాహోరీ పోరును ఆస్వాదిన్చాలనుకున్న టెన్నిస్ నాదల్  మిస్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్