Sunday, January 19, 2025
Homeసినిమాఅంచ‌నాలు పెంచేసిన‌ ఎన్టీఆర్-31 పోస్ట‌ర్

అంచ‌నాలు పెంచేసిన‌ ఎన్టీఆర్-31 పోస్ట‌ర్

NTR-31:  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు (మే 20) సంద‌ర్భంగా 31వ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. కేజీఎఫ్ సినిమాతో చ‌రిత్ర సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో ఎన్టీఆర్ సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్ట‌ర్ ని గ‌మ‌నిస్తే.. ఎన్టీఆర్ సిసలైన మాస్ రూపాన్ని ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్లుగా తెలుస్తుంది.

పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుంది అనిపిస్తోంది. పెద్ద మీసాలు.. తీక్షణమైన కళ్లతో ఎన్టీఆర్ చాలా ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపిస్తున్నారు. ఇంటెన్స్ లుక్ తో పోస్టర్ స‌రికొత్త‌గా ఉంది. ఎన్టీఆర్ ని స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తోన్న‌ ఈ పోస్టర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ 2023 లో ఏప్రిల్ లో ప్రారంభం కానున్న‌ద‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. ఈ చిత్రంలో న‌టించే న‌టీన‌టులు ఎవ‌రు అనేది తెలియాల్సివుంది.

Also Read : ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో NTR 30.. మోష‌న్ పోస్టర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్