Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్, కొరటాల మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

ఎన్టీఆర్, కొరటాల మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ  వస్తోన్న విషయం తెలిసిందే. అయితే… ‘ఆచార్య ‘ డిజాస్టర్ తరువాత ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు మొదలయ్యాయి. కథపై మరోసారి వర్క్ చేయమని కొరటాలకు ఎన్టీఆర్ సూచించారు. ఫైనల్ గా కొరటాల చేసిన మార్పులు చేర్పులు నచ్చడంతో సినిమా మొదలుపెట్టేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే సెట్స్ పైకి  ఎప్పుడు వెళుతుందనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే దానిపై  అప్ డేట్ కావాలంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని కోవిడ్ నేపథ్యంలో తెర పైకి తీసుకురానున్నారట.

కోవిడ్ నేపథ్యంలో మెడికల్ మాఫియా జెడలు విప్పిన తీరు సామాన్యుడిని ఆహాకారాలు.. ఆర్తనాదాలు చేసేలా చేసింది. ఇదే అంశాన్ని ఈ మూవీలో ప్రధానంగా చర్చించబోతున్నారట. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్