Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నారా..?

ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నారా..?

ఎన్టీఆర్, కొరటాల శివతో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ నెల 24 నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ నటిస్తుందని సమాచారం. ఈ క్రేజీ మూవీని నందమూరి కళ్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది.

అయితే.. ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఏంటా స్టోరీ అంటే.. సముద్రం, పోర్ట్, స్మగ్లిింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ అని… ఈ కథలో ఎన్టీఆర్ సింగిల్ రోల్ కాదు.. డబుల్ రోల్ అని. ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా డబుల్ రోల్ లో కనిపిస్తారు. ఈ మూవీ రివెంజ్ డ్రామా అని ప్రచారంలో ఉన్న స్టోరీ సారాంశం. అలాగే ఇప్పటి వరకు టచ్ చేయని పాయింట్ ఇందులో ఉంటుందని.. కొరటాల చాలా కొత్త విషయాలు చూపిస్తారని అంటున్నారు. వినడానికి సింపుల్ స్టోరీలానే ఉండచ్చు కానీ.. చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడంతో కొరటాల శివ ఈసారి ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నారు. అందుకనే కథ పై మళ్లీ మళ్లీ వర్క్ చేశారు. ఫైనల్ గా స్టోరీ లాక్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఇందులో డబుల్ రోల్ చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఇది నిజమా..? కాదా..? అని ఆరా తీస్తున్నారు. ప్రచారంలో ఉన్న కథ పైనా, డబుల్ రోల్ పైనా క్లారిటీ రావాలంటే.. మూవీ సెట్స్ పైకి వచ్చే వరకు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్